జయరామ్ హత్య కేసు : డబ్బు కోసం కాదట..మరెందుకు

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 06:26 AM IST
జయరామ్ హత్య కేసు  : డబ్బు కోసం కాదట..మరెందుకు

హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం  రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డబ్బు గురించి అడిగేందుకు వెళ్లాడనీ..దానికి జయరాం సరిగా సమాధానం చెప్పలేదనీ..అందుకే రాకేశ్ రెడ్డి జయరాంపై చేసిన దాడిలో చనిపోయాడని ఇప్పటివరకూ అనుకుంటున్న క్రమంలో ఇది అబద్దమని తేలటం..కొత్త విషయంగా కనిపిస్తోంది. డబ్బు కోసం కాకపోతే మరి జయరాంను రాకేశ్ రెడ్డికు ఎందుకు చంపాడు అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.  

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నేతలతో రాకేశ్ రెడ్డికి పలు కీలక అంశాలలో లింకులు వున్నట్లుగా పోలీసులు విచారణల్లోవెల్లడయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డితో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. జయరాం రాకేశ్ రెడ్డికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విచారణలో వెల్లడి కావటం..మరో నిందితురాలు శ్రిఖా చౌదరి పాత్ర…పలు అనుమానాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.  దీంతో హత్య జరిగిన తీరును రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  శ్రిఖా చౌదరిని కూడా మరికాసేపట్లో పోలీసులు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని.. పోలీసులు భావిస్తున్నారు.