Niloufer Kidnap Case : పిల్లలు లేరని పిల్లాడ్ని ఎత్తుకుపోయిన దంపతులు .. నిలోఫర్ బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి మరో తల్లి గుండెల్లో చిచ్చు పెట్టింది. తనకు బిడ్డ కావాలనే స్వార్ధంతో బిడ్డను ఎత్తుకుపోయింది.కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండె పగిలింది.పిల్లాడి కోసం తల్లడిల్లిపోయింది. పోలీసులకు తన బాబును తెచ్చివ్వాలని మొరపెట్టుకుంది.

Niloufer Kidnap Case : పిల్లలు లేరని పిల్లాడ్ని ఎత్తుకుపోయిన దంపతులు .. నిలోఫర్ బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Niloufer hospital child Kidnapping case : పిల్లలు లేని దంపతులు మరో దంపతులు గుండెల్లో చిచ్చు పెట్టారు. ఆస్పత్రికి వచ్చి ఓ చంటిపిల్లాడ్ని దొంగిలించి తీసుకెళ్లిపోయారు. దీంతో కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండె పగిలింది.పిల్లాడి కోసం తల్లడిల్లిపోయింది. పోలీసులకు తన బాబును తెచ్చివ్వాలని మొరపెట్టుకుంది.కన్నతల్లి బాధను విన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిలోఫర్ ఆస్పత్రిలో దొంగిలించబడిని చంటిపిల్లాడిని కనుగొని తల్లి ఒడికి చేర్చారు. హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్ కు గురైన ఆరు నెలల బాలుడ్ని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాప్ కేసును ఛేధించారు. ఆరు నెలల పిల్లాడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమత,శ్రీను దంపతులు. వీరికి అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు.15 రోజులు క్రితం మరోసారి బిడ్డ పుట్టాడు కానీ అనారోగ్యంతో నిలోఫర్ లోనే చికిత్స చేయిస్తున్నారు. కానీ ఆ పిల్లాడు కూడా చనిపోతాడని వారు అనుకున్నారు.దీంతో ఎవరి పిల్లాడినైనా కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకుని చికిత్స కోసం వచ్చిన ఫరీదా బేగం ఆరు నెలల చిన్నారి ఫైసల్‌ఖాన్‌ను కిడ్నాప్ చేశారు. అక్కడ నుంచి పక్కా ప్లాన్ ప్రకారం బాన్సువాడ తీసుకెళ్లిపోయారు. అప్పటికే మమత బాలింత కావటంతో పిల్లాడికి పాలు ఇచ్చేది.

Viral Video : కాలువలోంచి కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లు ..!

ఈక్రమంలో తమ బిడ్డ పోగొట్టుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. అలా నిలోఫర్ హాస్పిటల్ నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. అలా నిందుతుల ఆచూకీ పట్టుకుని బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

తమకు పిల్లలు లేరని పుట్టినవారు చనిపోతున్నారని చెప్పుకుని వాపోయింది మమత. బిడ్డ కోసం ఆశపడే తీసుకెళ్లిపోయామని కన్నీటితో తెలిపింది. ఆస్పత్రిలో ఎంతోమంది పసిపిల్లలను చూశాం కానీ ఆ బిడ్డ తనను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని మమత చెప్పింది.కానీ కిడ్నాప్ చేయటం నేరం అంటూ పోలీసులు మమతను..ఆమె భర్త శ్రీనును అరెస్ట్ చేశారు.బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజులుగా బిడ్డను కనిపించక అస్సలు దొరుకుతాడో లేదో కూడా తెలియక తల్లడిల్లిపోతున్న తల్లి బాబును గుండెలకు హత్తుకుని కన్నీరు కార్చింది. పోలీసులకు దంపతులిద్దరు ధన్యవాదాలు తెలిపారు.