తెలంగాణ ఆర్టీసీ సమ్మె : సుముఖంగా లేరు..ప్రయత్నం చేస్తా – పవన్ కళ్యాణ్

  • Published By: madhu ,Published On : November 1, 2019 / 02:32 PM IST
తెలంగాణ ఆర్టీసీ సమ్మె : సుముఖంగా లేరు..ప్రయత్నం చేస్తా – పవన్ కళ్యాణ్

Updated On : November 1, 2019 / 2:32 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్‌న కలిసిన సంగతి తెలిసిందే. సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తానని..సమస్యపై చర్చిస్తానని హామీనిచ్చారు. తాజాగా నవంబర్ 01వ తేదీ శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్, కే.కేశవరావు, మంత్రులు కేటీఆర్, ఇతరులు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపారు. సమ్మె పరిష్కార విషయంలో సీఎం కేసీఆర్, కేశవరావు, ఇతర మంత్రులను తాను కలవడానికని సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నించినట్లు తెలిపారు. కానీ..ఎవరూ మాట్లాడటానికి ఎందుకో సిద్ధంగా లేరని, అందువల్ల వారిని కలువలేకపోతున్నట్లు వెల్లడించారు. 

Read More : తేలుతుందా : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష
నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ జనసేన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మార్చ్‌లో పాల్గొనాల్సి ఉందని..ఈ కార్యక్రమం అనంతరం మరోసారి సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానని మరోసారి జనసేనానీ హామీనిచ్చారు. 

ప్రభుత్వ అసమర్థత వైఖరితో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడేందుకు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టింది. నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్‌కు వేలాదిగా తరలిరావాలని కార్మికులకు అండగా నిలబడుదామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. 

సుముఖంగా లేరు.. అయినా ప్రయత్నం చేస్తా – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/Zs45etbCfX