ప్యారడేజ్ టేస్టే వేరు : ఏడాదిలో 70లక్షల బిర్యానీలు తిన్నారు

హైదరాబాద్…బిర్యాని తప్పకుండా తినాల్సిందే అనుకుంటారు. లొట్టలు వేసుకుంటూ వేడి వేడిగా ఉన్న బిర్యాని ఆరగిస్తుంటారు. హైదరాబాద్ వచ్చే వారు ఆ హోటల్‌కి మాత్ర తప్పకుండా వెళుతుంటారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ఎంతో మంది భాగ్యనగరానికి వస్తే…ఇక్కడ వాలిపోయి బిర్యాని తిని టెస్ట్ అదరహో అంటూ కితాబిచ్చి వెళ్లిపోతుంటారు. సామాన్యుడి నుండి ప్రముఖులు ఆ బిర్యానికి ఫిదా అయిపోయారు. ఏ బిర్యాని గురించి చెబుతున్నామో అర్థం అయ్యిందని అనుకుంటా..అదే ప్యారడైజ్ బిర్యాని. ఒక్క ఏడాదిలోనే 70 లక్షల మంది ఇక్కడ బిర్యానిలు ఆరగించారంట. అవును నిజం. ఇదొక రికార్డు.
గుర్తు వచ్చే వాటిలో బిర్యానీ ఒకటి. హైదరాబాదీ బిర్యానికి ప్రపంచ స్థాయిలో పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పారడైస్ బిర్యానీ ఎంతో ఫేమస్. మరి ఎంతో ఘుమఘుమలాడే బిర్యానీ అందించే పారడైస్ ఫుడ్ కోర్ట్ మరో మైలు రాయి దాటింది. జనవరి 1, 2017 నుండి డిసెంబర్ 31, 2017 మధ్యలో అత్యధిక స్థాయిలో మొత్తం 70,44,289 బిర్యానిలు కస్టమర్లకు సర్వ్ చేసి రికార్డ్ సృష్టించింది.
ఈ సందర్భంగా “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2019″లోకి పారడైస్ చేరింది. ఈ అచీవ్మెంట్‌ను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు 2019 ఎడిషన్‌లో రికార్డ్ చేశారు. ఇంతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని మాపై బాధ్యత పెరిగిందని పారడైస్ ఫుడ్ కోర్ట్ CEO గౌతమ్ గుప్తా అన్నారు.