ఓయూ ప్రొ.కాశీం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నివాసంలో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నివాసంలో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నివాసంలో విచారణ జరిగింది. ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొఫెసర్ కాశీంను అక్రమంగా అరెస్ట్ చేసారని.. వెంటనే కోర్ట్‌లో హాజరు పరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ పిటిషన్ విచారణకు స్వీకరించారు. సాయంత్రం 5 గంటలకు చీఫ్ జస్టీస్ నివాసంలో విచారణ జరిగింది. రేపు ఉదయం కాశీంను చీఫ్ జస్టిస్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఐదేళ్ల కిందట పెట్టిన కేసులో ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్ట్‌కు తెలిపామన్నారు అడ్వకేట్ రఘునందన్. 2016లో ఫైలైన కేసులో ఇప్పటివరకు కాశీం తప్పించుకు తిరుగుతున్నాడని ఎలా అంటారంటూ హైకోర్టు ప్రశ్నించిందన్నారు. రేపు ఉదయం 10 గంటలకు కాశీంను తమ నివాసంలో హాజరు పరచాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఉదయమే కాశీం ఇంటిపై గజ్వేలు పోలీసులు దాడులు చేపట్టారు. కాశీం ఇటీవలే విరసం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని కాశీం భార్య స్నేహలత ఆరోపించారు. కాశీం అరెస్టును ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. 2016లో శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద తన భర్త రాసిన పుస్తకాలు లభించడంతో అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. తన భర్తపై పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.