రవి ప్రకాశ్.. ఐ ఫ్రేమ్ సంస్థలో పోలీసుల సోదాలు
TV 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కు చెందిన మరో కంపెనీ ఐ ఫ్రేమ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

TV 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కు చెందిన మరో కంపెనీ ఐ ఫ్రేమ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
TV 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కు చెందిన మరో కంపెనీ ఐ ఫ్రేమ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐ ఫ్రేమ్ సంస్థలో పని చేసే ఉద్యోగులను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. TV 9 నుంచి నిధులను వివిధ సంస్థలకు మళ్లింపు వ్యవహారంలో తనకు సంబంధించిన వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ ను రవి ప్రకాశ్ నిర్వహిస్తున్నారు. వీటికి రవి ప్రకాశ్ నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
రెండు రోజులుగా రవి ప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నారు. TV 9 ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న మూర్తి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులను తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఏడు ప్రత్యేక బృందాలు రవి ప్రకాశ్ కోసం గాలిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రవి ప్రకాశ్ నుంచి ఎలాంటి వివరణ లేదు.
TV 9 కేంద్రంలో యాజమాన్యానికి సంబంధం లేకుండానే రవి ప్రకాశ్ స్వంతంగా వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవముందని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. TV 9 కార్యాలయం నుంచి 12 హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫోర్టరీకి సంబంధించిన వివరాలు, రవి ప్రకాశ్ అనుచరులు TV 9 కార్యాలయం నుంచి ఏం తీసుకెళ్లారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.