దయచేసి మా ఇంటికి రావొద్దు : నేతలు, పోలీసులకు ప్రియాంక తల్లిదండ్రుల విన్నపం
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు

మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు కీలక విన్నపం చేశారు. దయచేసి ఎవరూ మా ఇంటికి రావొద్దని వారు కోరారు. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. ఎవరొచ్చినా ఇప్పుడు చేసేదేమీ లేదన్నారు. ఎవరి సానుభూతి తమకు అక్కర్లేదన్నారు. అంతేకాదు… కాలనీ గేటుకి తాళం కూడా వేసుకున్నారు. ఎవరొచ్చినా తమ కూతురిని తిరిగి తీసుకురాలేరు కదా అని ప్రియాంక తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రియాంక హత్యాచారం ఘటన తర్వాత రాజకీయ నాయకులు ప్రియాంక ఇంటికి క్యూ కట్టారు. అన్ని పార్టీల నేతలు ప్రియాంక తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. కాగా, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను టార్గెట్ చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసుల సరిగ్గా స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని అంటున్నారు.
ప్రియాంక వెంటనే 100కి డయల్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ప్రియాంక పేరెంట్స్ ను హర్ట్ చేశాయి. అసలే బాధలో ఉంటే.. సూటిపోటి మాటలతో ఆ మరింత బాధకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీ పరామర్శలు, సానుభూతి మాకు అవసరం లేదు.. మాకు కావాల్సింది న్యాయం మాత్రమే అని తేల్చి చెప్పారు. ప్రియాంక నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.