పోలీసుల వ్యూహాత్మక అడుగులు: చర్లపల్లి జైలుకు నిందితులు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకోగా ప్రజాగ్రహంతో పోలీసులు చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు. అయితే భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నట్లుగా భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించాలని నిర్ణయించారు అధికారులు.
వీరిని తరలిస్తున్న పోలీసు బస్సుపైకి ప్రజలు రాళ్లు రువ్వారు ప్రజలు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని చెదరగొట్టారు. #WeWanJustice ప్రియాంక అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేలాదిగా వచ్చిన జనాలతో షాద్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే స్ట్రాటజిక్‌గా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
నిందుతులను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బ్లూ కలర్ వ్యాన్‌లో చర్లపల్లి జైలుకు తరలించారు. ఎస్కార్ట్ వెహికల్స్ కూడా వెంటే ఉన్నాయి. పూర్తి కట్టు దిట్టమైన ఏర్పాటు చేశారు పోలీసులు.