రాజాసింగ్ డిమాండ్ : సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలి

  • Published By: chvmurthy ,Published On : February 18, 2019 / 07:38 AM IST
రాజాసింగ్ డిమాండ్ : సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలి

Updated On : February 18, 2019 / 7:38 AM IST

హైదారాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే  రాజాసింగ్ , సీఎం కేసీఆర్ ను కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పుల్వామా దాడి ఘటన కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండి సైనికుల పట్ల సంతాపం తెలపటం సంతోషించ దగ్గ విషయమని  కేసీఆర్ ను ప్రశంసించారు.

 

అయినప్పటికీ పాకిస్తాన్ కోడలైన సానియామీర్జాను బ్రాండ్ అంబాసిడర్  హోదా నుంచి  తొలగించి, తెలంగాణాకు చెందిన  అంతర్జాజాతీయ  స్థాయి క్రీడాకారులకు ఆ హోదా ఇవ్వాలని  రాజాసింగ్  కోరారు.  సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్  షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.