మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స

  • Published By: vamsi ,Published On : April 19, 2019 / 04:35 AM IST
మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స

రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురి కాగా ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మురళీ మోహన్ తల్లి మాగంటి వసుమతి దేవి (100) మరణించగా ఇవాళ(19 ఏప్రిల్ 2019) విజయవాడలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. వసుమతి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రూప కారు రోడ్డుప్రమాదానికి గురైనట్లు సమాచారం.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్