RTC ప్రయాణీకులకు శుభవార్త : హైదరాబాద్‌లో కొత్త బస్సులు

TS RTC హైదరాబాద్ నగరంలో మరో 165 కొత్త బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మూడేళ్ల క్రితం తీసుకున్నా నేటికి అమలులోకి రానుంది. నగరంలో గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న బస్సులను మార్చటంపై దృష్టిపెట్టింది. వీటి వల్ల నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో వీటిస్థానంలో కొత్త బస్సులను నడపాలనుకుంటోంది.ప్రస్తుతం సిటీలో నడుస్తున్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను మార్చి వాటి స్థానంలో కొత్త బస్సులను నడపనుంది.
ఆర్టీసీ ప్రస్తుతం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కొత్త బస్సుల కొనుగోలును వాయిదా వేస్తు వచ్చింది. కొత్త బస్సులను కొనాలంటే ఒకొక్క బస్సుకు రూ .25 లక్షలు ఖర్చవుతుంది. ఒకేసారి 165 బస్సులు కొనడం ఖరీదైన వ్యవహారమని అధికారులు తెలిపారు.
ఇప్పటికే నష్టాల్లో ఆర్టీసీ నడుస్తున్న ఆర్టీసీకి ఇది మరింత భారంకానుందనీ..గత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో రూ .900 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని తెలిపారు. దీంతో కొత్త బస్సులు కొనాలంటే రూ.41 కోట్లు అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇది తీవ్ర భారమే అవుతుందని సీనియర్ అధికారి తెలిపారు.
నగరవ్యాప్తంగా 3,800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.వీటిలో వీటిలో 180 బస్సులు 15 సంవత్సరాలనాటివే. దీంతో నగరం నుంచి వీటిని గ్రామీణ ప్రాంతాల రూట్లలో నడపనున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని నియంత్రించటానికి 15 సంవత్సరాలుగా నడుస్తున్న బస్సులను నడపకూడదనే నిషేధం ఉంది. వీటి వల్ల కాలుష్యంతో పాటు పాత బస్సులను నడపటానికి వాటికయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉండటం..వాటికి తరచు స్పేర్ పార్ట్ వేయాల్సివస్తోంది.
దీంతో ఖర్చు కూడా భారీగా పెరుగుతోందని దీంతో వాటిని నిలిపివేయాలనుకుంటున్నామని తెలిపారు. ప్రయాణీకులకు కూడా పాత బస్సుల్లో ప్రయాణంతో విసుగు చెందారనీ..మార్గం మధ్యలో ఎక్కడ ఆగిపోతాయో తెలీయదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో భారమే అయినా..యాణీకుల సౌకర్యార్థం పాత బస్సులను తీసివేసి కొత్త బస్సులను నడపాలనుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు.