సర్వే సంచలనం : కాంగ్రెస్‌లో రౌడీమూకలు : సస్పెన్షన్

హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గాంధీభవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమీక్షలో పాల్గొన్న సర్వే.. పీసీసీ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీని కాపాడాలంటే ఉత్తమ్, కుంతియాలపై చర్యలు తీసుకోవాలని సర్వే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీమూకలున్నాయని ఫైరయ్యారు. పార్టీ ఎవరి చేతిలో ఉందో రేపు చెబుతానంటూ వెళ్లిపోయారు. టీ-పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. సర్వే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.