రెండవ రోజు అటుకుల బతుకమ్మ

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 02:40 AM IST
రెండవ రోజు అటుకుల బతుకమ్మ

Updated On : September 29, 2019 / 2:40 AM IST

బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. ప్రకృతిని పూజించే పూల పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే..రంగు రంగుల పూల సందళ్లే.   శనివారం  (సెప్టెంబర్ 28) ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు ప్రారంభమయ్యాయి. రంగురంగుల బతుకమ్మలు పేర్చిన మహిళలు, బతుకమ్మ పాటలతో సందడి చేశారు.

ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన ఆడబిడ్డలు రెండవ రోజు ఆదివారం  (అక్టోబరు 29) ‘ అటుకుల బతుకమ్మ’ను పూజిస్తారు. తంగేడు , గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు. రెండ రోజు కాబట్టి ఈ పూలతో రెండు ఎత్తులలో పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ పూలపై గౌరమ్మను పెట్టి సాయంత్రం ఆటపాటలతో సందడి చేసిన బతుకమ్మను చెరువులలో నిమజ్జనం చేస్తారు. తరువాత అటుకులను వాయనంగా ఇస్తారు. ఇదే రెండవ రోజు అటుకుల బతుకమ్మ. బతుకమ్మకు నైవేద్యంగా  సప్పిడి పప్పు  బెల్లం, అటుకులను పెడతారు. 

తెలంగాణ ఆడబిడ్డలకు ఎక్కడున్న బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ  ఉయ్యాలో అంటూ చిన్నా పెద్దా  ఆడి పాడతారు. తమ కష్టసుఖాలను బతుకమ్మకు చెప్పుకుంటారు. బతుక్మ అంటే తమ ఇంటి ఆడబిడ్డగా కొలుచుకుంటారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఇలా రెండ రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలను ఆడబిడ్డలు జరుపుకుంటారు.