సెల్ఫీ వీడియో :ఝాన్సీ సూసైడ్ కు కారణాలు తెలిసేనా ?

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 03:13 PM IST
సెల్ఫీ వీడియో :ఝాన్సీ సూసైడ్ కు కారణాలు తెలిసేనా ?

Updated On : February 6, 2019 / 3:13 PM IST

హైదరాబాద్ : ప్రముఖ టీవీ నటీ  ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో ఝాన్సీ ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తన స్వంత గ్రామంలో అంతక్రియలు జరుపుతామని బంధువులు మృత దేహాన్ని కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వడాలి కి తరలించారు.ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఝాన్సీ గత కొంతకాలంగా సూర్య అనే వ్యక్తితో పరిచయం పెంచుకుందని, అతడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. శ్రీనగర్ కాలనీలో నిన్న రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఝాన్సీ ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీ నుండి వచ్చిన తన సోదరుడు,ఆత్మహత్య చేసుకున్న ఝూన్సీని  చూసి షాక్ కు గురై   పోలీసు సహాయం కోసం 100 కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని , మృత దేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే  పవిత్రబంధం అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలం వడాలి గ్రామం. సీరియల్ లో నటిస్తున్న మధు అనే నటి విజయవాడకు చెందిన సూర్య తేజాను ఝాన్సీకి పరిచయం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించకుంటున్నారని, సూర్య వత్తిడితోనే సీరియల్స్ ను సైతం వదిలి పెట్టి, బ్యూటీ పార్లర్ నడుపుకోవాలనుకుందని, ఇప్పుడు పెళ్లికి సూర్య నిరాకరించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు నిందితుడు సూర్య మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. తనకు ఈ ఆత్మహత్యకు ఎలాంటి సంభంధం లేదని సూర్య కొంత మందితో ఫోన్ లో సంభాషించినట్లు సమాచారం. ఝాన్సీని పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట వాస్తవమే కానీ,అమె అనేక మందితో సంభంధాలు పెట్టుకుందని దాని వల్లే ఆమెను వదిలి వేశానని నిందితుడు సూర్య చెపుతున్నాడు. పోలీసులు  సూర్యను  అరెస్ట్ చేసి పూర్తిగా విచారిస్తే కానీ ఆత్మహత్యకు గల కారణాలు బయటపడే అవకాశం లేదంటున్నారు ఝూన్సీ బంధువులు.
 
తనకూతురు చావుకు కారణమైన సూర్య కు ఊరి శిక్ష విధించాలని ఝాన్సీ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.   బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో ధర్యాప్తు జరుపుతున్నామని పంజాగుట్ట ఏసిపి తెలిపారు. సూర్యతో తలెత్తిన విభేదాల కారణంగా  నాలుగు రోజులుగా డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉండచ్చని పోలీసులు అంటున్నారు.  ఝూన్సీ ఉపయోగించిన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె సూర్యతో చేసిన వాట్సప్ చాట్ ద్వారా మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. అదీ కాక తను చనిపోయే ముందు, ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు చెపుతూ  సెల్ఫీ వీడియో తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా  ఒక వర్ధమాన సీరియల్ నటి ప్రేమ వ్యవహరంలో ఆత్మహత్య చేసుకోవడం అటు సీరియల్ వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. ఇక తమ కూతురు చావుకు కారణమైన నిందితుడు సూర్య ను కఠినంగా శిక్షించాలని మరోవైపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.