హైదరాబాద్ మురుగునీటిలో కరోనా ఆనవాళ్లు

హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనలు తేల్చేశాయి. మురుగునీటి నమూనాలో కరోనా వ్యాధిపై పరిశోధనలు జరిపారు. ముక్కు, నోటీ ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వ్యాధి సోకిన 35 రోజుల వరకు వైరస్ విడుదల అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మురుగు నీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీలోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతు ఉన్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
నగరం చుట్టు పక్కలా ప్రాంతాల్లో కరోనా కేసుల కంటే ఒక్క జీహెచ్ఎంసీలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది..
ఇప్పటివరకూ కరోనా కేసులు ఒకరి నుంచి మరొకరికి ముక్కు శ్వాస ద్వారానే కాకుండా నోటీ ద్వారా కూడా వ్యాపిస్తోంది.. ఇప్పుడూ మురుగు నీటి ద్వారా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీలో కూడా కరోనా ఆనవాళ్లు కనిపించడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.