సింగరేణికి ప్రతిష్టాత్మక ‘అవార్డు’

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 11:16 AM IST
సింగరేణికి ప్రతిష్టాత్మక ‘అవార్డు’

Updated On : February 15, 2019 / 11:16 AM IST

సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డును సింగరేణి కాలరీస్ కంపెనీకి ఇచ్చారు.

ఈ అవార్డు వచ్చే నెల 8న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఈ అవార్డు స్వీకరించేందుకు రావాలని  సింగరేణి సిఎండి  శ్రీధర్ కు బెర్క్ షైర్ మీడియా సిఇఒ శ్రీ హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానం పంపారు. ఈ అవార్డు స్వీకరణకు సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.