రైల్వే స్పెషల్ డ్రైవ్ : రూ.14.51లక్షల ఈ-టికెట్లు స్వాధీనం

  • Published By: sreehari ,Published On : October 29, 2019 / 10:35 AM IST
రైల్వే స్పెషల్ డ్రైవ్ : రూ.14.51లక్షల ఈ-టికెట్లు స్వాధీనం

Updated On : October 29, 2019 / 10:35 AM IST

దీపావళి పండుగ సందర్భంగా రైల్వే టికెట్లపై దళారుల దందాకు దక్షిణ మధ్య రైల్వే అడ్డుకట్టవేసింది. అనాధికారిక టికెట్ల విక్రయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో రూ.14.51 లక్షల విలువైన ఈ-టికెట్లను బోర్డు స్వాధీనం చేసుకుంది.

దీపావళి పండుగ సమయంలో బోనఫైడ్ ప్యాసింజర్ల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్యాసింజర్ రిజర్వేషన్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు పలు నగరాల్లో దక్షిణ రైల్వే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించింది. 

ప్రధానంగా వరంగల్, యాదిగిరి, రాయ్ చూర్, బాపట్ల సహా పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. SCR పత్రికా ప్రకటన ప్రకారం.. 1,046 ఈ-టెకట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో 206 లైవ్ టికెట్లు ఉండగా, 840 జర్నీ పూర్తి అయిన టికెట్లు ఉన్నాయి. ఈ టికెట్లను కమిషన్ ఆధారంగా బుకింగ్ చేసుకున్నట్టు రైల్వే బోర్డు గుర్తించింది.

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెక్షన్ 143 రైల్వే యాక్ట్ కింద 24 కేసుల్లో ఈ-టికెట్ల విక్రయానికి పాల్పడిన 25మంది దళారులను SCR అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇలాంటి మోసపూరిత ఏజెంట్ల నుంచి రైల్వే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోరాదని రైల్వే బోర్డు హెచ్చరిస్తోంది.