SPY రెడ్డి ఆరోగ్యం విషమం
SPY రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్..బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

SPY రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్..బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
SPY రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్..బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా ఆయన ఇక్కడనే ఉన్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నా ఆరోగ్యం కుదుటపడడం లేదు. రోజు రోజుకు విషమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హెల్త్ కండీషన్‌పై నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read Also : APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!
కొలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు SPY రెడ్డి. ఈయన నంద్యాల నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థిగా నంద్యాల బరిలో నిలిచారు.
వయస్సు మీద పడుతున్నా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు. దీనితో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం నిర్వహించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్