ఎంపీ కవితకు శ్రేష్ట్ సంసద్ అవార్డు 

తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు శ్రేష్ట్ సంసద్ అవార్డు లభించిందని ఎంపీ కవిత అన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 07:42 PM IST
ఎంపీ కవితకు శ్రేష్ట్ సంసద్ అవార్డు 

Updated On : January 31, 2019 / 7:42 PM IST

తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు శ్రేష్ట్ సంసద్ అవార్డు లభించిందని ఎంపీ కవిత అన్నారు.

ఢిల్లీ : ఎంపీ కవిత శ్రేష్ట్ సంసద్ అవార్డును అందుకుంది. ఫేమ్ ఇండియా ఏషియా ఫోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కవితకు వివిధ అంశాలలో 90 శాతంపైగా పాయింట్లు దక్కాయి. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవా దృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఎంపీ కవితకు అవార్డు దక్కింది. ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు అవార్డు లభించిందన్నారు.

మరింత ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొసాగిస్తామని పేర్కొన్నారు.