కార్‌లో, బిల్డింగుల్లో ఏసీలు ఆపేయండి.. కరోనాను అడ్డుకోండి

హైదరాబాద్‌లో కమర్షియల్ బిల్డింగుల్లో.. కార్లో ఏసీలు ఆపేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. కొవిడ్-19వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరని చెబుతున్నారు. సాధారణ గాలిలో ఉండే పరిస్థితులతో పోలిస్తే.. ఏసీలో ఉండే వాతావరణం కరోనా వ్యాప్తిని పెంచే అవకాశాలు పెంచుతుంది. కార్లో ఒక వ్యక్తికి ఉన్న వైరస్ మరొకరికి ఈజీగా సోకుతుంది.
‘కారులో ప్రయాణిస్తుండగా ప్యాసింజర్.. లేదా డ్రైవర్ పూర్తిగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఏసీ ఆన్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే కారులో ప్రయాణించే ఇంకొక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియదు కాబట్టి’ అని ద అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డా.పీ రఘురామ్ అన్నారు.
కొన్ని పరిస్థితుల్లో కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తుందని WHO చెప్తుంది. ఏసీ ఆన్ చేసి ఉందంటే దానికి అర్థం క్లోజ్ డ్ రూంలోనే ఉన్నట్లు కాబట్టి. ఒకటే గాలిని అందరూ పీల్చుతూ ఉంటారు. అంటే కార్లో అయినా రూంలో అయినా ఒకటే గాలిని పీలుస్తూ ఉన్నామనే విషయం తెలుసుకోవాలి. ఎవరైనా ఒకవ్యక్తికి కరోనా ఉంటే అది అందరికీ సులువుగా వ్యాపిస్తుంది.
తెలంగాణలో ఇదే తరహాలో రోజుకు 2వేల వరకూ కరోనా కేసులు పెరిగాయి. చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత ప్రస్తుతం కేసుల సంఖ్య బాగా తగ్గింది. జూన్ వరకూ రోజూ పెరిగిన కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.