కొత్త బాస్ : టీ హబ్ సీఈవోగా రవి నారాయణ్

హైదరాబాద్: తెలంగాణకు ఐకాన్‌గా ఉన్న స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌కి కొత్త బాస్ వచ్చారు. టీ హబ్ నూతన సీఈవోగా రవి నారాయణ్ నియమితులయ్యారు. రవి నారాయణ్

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 03:10 PM IST
కొత్త బాస్ : టీ హబ్ సీఈవోగా రవి నారాయణ్

Updated On : January 29, 2019 / 3:10 PM IST

హైదరాబాద్: తెలంగాణకు ఐకాన్‌గా ఉన్న స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌కి కొత్త బాస్ వచ్చారు. టీ హబ్ నూతన సీఈవోగా రవి నారాయణ్ నియమితులయ్యారు. రవి నారాయణ్

హైదరాబాద్: తెలంగాణకు ఐకాన్‌గా ఉన్న స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌కి కొత్త బాస్ వచ్చారు. టీ హబ్ నూతన సీఈవోగా రవి నారాయణ్ నియమితులయ్యారు. రవి నారాయణ్ మైక్రోసాఫ్ట్‌లో స్టార్టప్స్ వింగ్స్‌కి గ్లోబల్ హెడ్‌గా పని చేశారు. నారాయణ్‌కు అపారమైన అనుభవం ఉంది. స్టార్టప్ ఎకో సిస్టమ్స్ రూపకల్పనలో 20ఏళ్ల అనుభవం ఉంది. IIT మద్రాస్‌లో చదివారు. సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. గతంలో టీ హబ్ సీఈవోగా ఉన్న జై కృష్ణన్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు రవి నారాయణ్‌కి ఇచ్చారు.

 

టీ హబ్ ద్వారా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ తీసుకురావడమే తన లక్ష్యమని రవి నారాయణ్ చెప్పారు. టాస్క్, టీఎస్ఐఐసీలతో కలిసి పని చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రిసెర్చ్ సెంటర్స్ ఉన్నాయని, వాటన్నింటితో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. టీ హబ్‌తో 60కి పైగా కంపెనీలు, 10 స్టేట్ గవర్నమెంట్‌లు టై అప్ అయ్యాయన్నారు. వీటి సహకారంతో యువత మరిన్ని ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహిస్తామని రవి నారాయణ్ చెప్పారు. మరిన్ని కార్పొరేట్ ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఇప్పటి వరకు టీ హబ్‌లో 800కు పైగా ఈవెంట్స్ జరిగాయని, వాటి  ద్వారా చాలామంది స్టార్టప్స్ గురించి అవగాహన పెంచుకున్నారని వివరించారు.

 

ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్‌ను స్టార్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో టీ హబ్‌ భవనాన్ని కాటలిస్ట్ పేరుతో నిర్మించారు. దేశంలోనే ప్రభుత్వం రంగంలో నిర్మితమైన ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే కావడం విశేషం.  ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థికంగా సహకరించే సంస్థ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు వర్క్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న టీ హబ్‌ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.