అభివృద్ధిలో తెలంగాణ ముందంజ : గవర్నర్ స్పీచ్ హైలెట్స్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో ముందంజలో కొనసాగుతోందని…ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు జనవరి 19వ తేదీ శనివారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని చదివారు. అనంతరం ఇంగ్లీషులో ప్రసంగాన్ని చదివారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు..చేపట్టబోయే వాటిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. శాసనసభ్యులంతా ప్రజా సేవలో నిమగ్నమౌతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
-
గత నాలుగున్నరేళ్లలో నీటి పారుదలకు రూ. 77 వేల 777 కోట్లు ఖర్చు.
-
సంక్షేమ అమలులో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాం.
-
మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని గ్రామాలకు ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు.
-
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.
-
షాదీ ముబారక్..కళ్యాణ లక్ష్మి దేశానికే ఆదర్శం.
-
రాబోయే కాలంలో రూ. లక్షా 17 వేల కోట్లు పనులు చేస్తామన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలు ఇచ్చింది.
-
వృద్ధిరేటులో తెలంగాణ ముందంజలో ఉంది.
-
విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించింది.
-
పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయి.
-
జీఎస్టీ వసూళ్లలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
-
తెలంగాణ అవినీతి రహిత పాలన దిశగా కొనసాగిస్తోంది.
-
చట్ట సభల్లో బీసీలకు 33 శాతం…మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం.
-
భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి ఈ ఏడాది నుండే విద్యుత్ ఉత్పత్తి.
-
ప్రస్తుతం 16, 503 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అందుబాటులో ఉంది.
-
గత నాలుగేళ్లలో ఇరిగేషన్‌కు రూ. 77 వేల 777 కోట్ల ఖర్చు
-
సొంతింటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం రూ. 5 నుండి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం.
-
రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి.
-
పంటలకు గిట్టుబాటు ధర కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు.
-
ప్రభుత్వం రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ.
-
రైతు బంధు పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శం.
-
రైతు బీమా రైతు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తోంది.
-
ఐకేపీ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలనే యోచన.
Read More :
అసెంబ్లీ టైమ్ : గవర్నర్ ప్రసంగం