టి కేబినెట్ మీటింగ్ : కేసీఆర్..మహమూద్ ఆలీ హాజరు…

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగనుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ ఇదే. జనవరి 07వ తేదీ ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ ఆలీ..అధికారులు మాత్రమే పాల్గొననున్నారు. రాష్ట్ర కేబినెట్ ఇంకా విస్తరించలేదనే విషయం తెలిసిందే.
ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న స్టీఫెన్ సన్‌కు మరోసారి కేసీఆర్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆంగ్లో ఇండియన్ ఎంపిక చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాని అంశాలపై కేబినెట్ సమావేశం చర్చించనుంది. అసెంబ్లీ నిర్వహణకు ఆమోదం…గ్రామ పంచాయతీ ఎన్నికలు…రైతు బంధు, చీరల పంపిణీ, పెన్షన్ల పెంపు ఇతరత్రా అంశాలపై కేబినెట్ చర్చించనుందని టాక్. మొత్తంగా కేబినెట్ ఏజెండాలో 8-10 వరకు అంశాలున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.