చెల్లితో ముచ్చట్లు : యువకుడిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించి

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 07:47 AM IST
చెల్లితో ముచ్చట్లు : యువకుడిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించి

Updated On : April 24, 2019 / 7:47 AM IST

అన్నలు ఉండే చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు జర భద్రంగా ఉండాలె. ఎందుకంటే ఇదిగో ఇటువంటి పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తన చెల్లితో మాట్లాడుతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అన్న ఉదంతం వెలుగులోకొచ్చింది. అంతటితో ఊరుకోకుండా అతనికి గుండు కొట్టించి ఇష్టమొచ్చినట్లు బాదేశాడు ఓ అన్న. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివాసించే మహ్మద్ మన్సూర్ అలీఖాన్ అలియాస్ నసీర్ అనే 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతంలో ఉండే ఓ యువతితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇది గమనించిన యువతి అన్న ఇబ్రహీంఖాన్ సోమవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం మన్సూర్‌కు ఫోన్ చేసి మాట్లాడే పని ఉంది జీవీకే మాల్‌వద్దకు రమ్మన్నాడు.

స్నేహితులతో కలిసి అప్పటికే జీవీకే వద్దకు చేరుకున్నాడు ఇబ్రహీంఖాన్. అక్కడకు వచ్చిన మన్సూర్‌ను కారులో ఎక్కమన్నాడు. ఎందుకు? ఎక్కడికెళ్లాలి? అంటు ప్రశ్నించాడు. దాంతో అతడ్ని బలవంతంగా కారులోకి లాగి సైదాబాద్ సమీపంలోని అక్బర్‌బాగ్‌కు తీసుకెళ్లారు. అక్కడుండే ఓ హెయిర్ సెలూన్‌లో లాక్కెళ్లి గుండు కొట్టించారు. తరువాత మళ్లీ కారెక్కించుకుని బూతులు తిడుతు..ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అందంతా సెల్ ఫోన్ లో షూట్ చేశారు. తరువత మన్సూర్‌ సెల్‌ఫోన్‌..రూ.5వేలను లాక్కొని రాత్రి 7.45కు అరాంఘర్ చౌరస్తావద్ద వదిలేశారు. ఇంకెప్పుడు తన చెల్లితో మాట్లాడితే చంపేస్తామంటు హెచ్చరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన మన్సూర్ సోమవారం అర్ధరాత్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇబ్రహీంఖాన్‌తో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.