రాజకీయంగా కాదు : KTRకు ప్రభాస్ మద్దతు

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 03:35 PM IST
రాజకీయంగా కాదు : KTRకు ప్రభాస్ మద్దతు

Updated On : September 10, 2019 / 3:35 PM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు సినీ నటుడు ప్రభాస్ మద్దతు పలికారు. రాజకీయంగా మాత్రం కాదు. పరిసరాల పరిశుభ్రత తన ఇంటి నుంచే మొదలు పెట్టారు కేటీఆర్. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లోని ఆయన నివాసాన్ని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

దీనిపై యాక్టర్ ప్రభాస్ స్పందించారు. వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా..ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలని..ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశార. దీనిపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. థాంక్స్ ప్రభాస్..ఫర్ యువర్ సపోర్టు అంటూ ట్వీట్ చేశారు. 

Read More : పరిసరాల పరిశుభ్రత : ఇంటిని క్లీన్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రమే కాకుండా..ఏపీలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది డెంగీ, మలేరియా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో నగరంలోని GHMC అప్రమత్తమైంది. పరిశుభ్రతపై చర్యలు తీసుకొంటోంది. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని GHMC సమీక్షలో మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

చెప్పడం కాదు..చేసి చూపించారాయన. నీటి తొట్టెలు, పూల కుండీలలో పేరుకపోయిన నీటిని తొలగించారు. నీరు నిల్వ ఉన్న వాటిలో దోమల మందు చల్లారు. ‘ఇళ్లు, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచినట్లు…మీరు కూడా ఆ పని చేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అంటూ మంత్రి KTR పిలుపునిచ్చారు.