పెద్దల సభ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

  • Published By: madhu ,Published On : February 22, 2019 / 11:23 AM IST
పెద్దల సభ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

Updated On : February 22, 2019 / 11:23 AM IST

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం..ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా కంప్లీట్ కావడంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం జాబితాను ప్రకటించారు. 

మొత్తం 5 స్థానాల్లో 4 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక స్థానాన్ని మాత్రం మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ తరపున హోం మంత్రి మహమూద్ ఆలీ, ఎగ్గె మల్లేశం, మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లను ప్రకటించారు. రెండు..మూడు రోజుల్లో వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. 

ఫిబ్రవరి 28వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న ఉపసంహరణకు గడువు. మార్చి 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. మార్చి 15 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.