ఆ ఒక్కటి తప్ప : 21 డిమాండ్ల పరిష్కారంపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ
హైదరాబాద్ బస్ భవన్‌లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.

హైదరాబాద్ బస్ భవన్‌లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
హైదరాబాద్ బస్ భవన్‌లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈడీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్లలో 21 అంశాల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం మినహా మిగతావాటిని పరిశీలిస్తున్నారు.
ఇప్పటికప్పుడు నెరవేర్చాల్సిన అంశాలేమిటి? దీర్ఘకాలికంగా, మధ్యంతరంగా ఏయే సమస్యల్ని పరిష్కరించవచ్చో కసరత్తు చేస్తున్నారు. ఈ 21 డిమాండ్ల పరిష్కరించే క్రమంలో కార్పొరేషన్‌పై ఎలాంటి భారం పడుతుంది? ఆ డిమాండ్లను ఎలా నెరవేర్చాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. గురువారం(అక్టోబర్ 24,2019) సాయంత్రానికి రిపోర్టును ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మకు అందించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు మాత్ర వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం ముందు పెట్టిన 26 డిమాండ్లలో.. ఏ ఒక్క దానిపై వెనక్కి తగ్గబోమని చెప్పారు. విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. 26 డిమాండ్లపై చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. 18 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉన్నారు.