ఆర్టీసీ జేఏసీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు : అశ్వత్థామరెడ్డి అరెస్టు
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.

టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం (అక్టోబర్ 18, 2019) హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి దగ్గర ఉన్న ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు. రేపటి తెలంగాణ బంద్ విజయవంతం కోసం బైకు ర్యాలీ చేస్తుండగా భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అంతకముందు అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సమ్మె ప్రారంభి 14 రోజులు గడుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను భయపెడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు భయపడొద్దన్నారు. ఆర్టీసీ జేఏసీని విచ్చిన్నం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు.
తాత్కాలిక కార్మికులు విధులకు వెళ్లొదని సూచించారు. వారందరూ తమకు సహకరించాలని కోరారు. భారత దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్స్ తమకు మద్దతు ప్రకటిస్తున్నాయని తెలిపారు. పోరాటాన్ని రోజు రోజుకు ఉధృతం చేయాలని పిలుపు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.