సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్‌కు వెళ్లారా.. జేబులకు చిల్లే

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్‌కు వెళ్లారా.. జేబులకు చిల్లే

Updated On : November 29, 2019 / 2:03 AM IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ దోపిడీపైన ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు రైల్వే చార్జీల కంటే పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయి. ప్రీమియం పార్కింగ్‌లో ద్విచక్ర వాహనాలకు గంటకు రూ.18 చొప్పున చెల్లించాలి. ఒక రోజంతా పార్క్ చేస్తే రూ.432వరకూ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకూ చార్జీ వంద కూడా ఉండదు. నాలుగు గంటల పాటు బండి పార్క్ చేస్తే మాత్రం రూ.72 అవుతంది. కార్లకు రెండు గంటలకు రూ.47చొప్పున పార్కింగ్ చార్జీ విధిస్తారు. ఒక రోజు పార్క్ చేస్తే రూ.564 వరకు చెల్లించాలి. 

సొంత వాహనాలను స్టేషన్లో పార్క్ చేసి దూర ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రయాణికులకు మాత్రం ఇది భారమే. బంధువులు, మిత్రుల కోసం రైల్వే స్టేషన్లో ఎదురుచూసే నగర వాసులు కూడా ఈ పార్కింగ్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఈ పార్కింగ్ బాదుడుతో పాటు తాజాగా టోయింగ్ బాదుడు కూడా షురూ చేశారు. మొదట యాక్సెస్ చార్జీలు నుంచి మొదలవుతుంది. రైల్వేస్టేషన్ స్థలాలు ఎంతో విలువైనవి. అలాంటి స్థలాల్లో వాహనాలను ఎక్కువసేపు నిలపడం వల్ల ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని అమల్లోకి తెచ్చాం. అని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి చెప్పారు. 

వసూలు విధానం ఇలా:
> పదో నంబర్ ప్లాట్ ఫామ్ వైపు వెల్లే మార్గంలో ఇందుకోసం ఒక కౌంటర్ ను ఏఱ్పాటు చేశారు. స్టేషన్ లోకి ప్రవేశించే సమయంలో ఈ కౌంటర్ వద్ద యాక్సెస్ టిక్కెట్ తీసుకోవాలి. 
> ఆ తర్వాత స్టేషన్ పోర్టికోలో బండి ఆగినప్పటి నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 
> తిరిగి వెళ్లేటప్పుడు పోర్టికోలో ఎంత సమయం ఆగిందీ లెక్కకట్టి చార్జీలు వసూలు చేస్తారు. మొదటి 10నుంచి 14నిమిషాలకైతే రూ.100చొప్పున ఆ తర్వాత 15 నుంచి 30నిమిషాల వరకూ రూ.200చొప్పున చెల్లించాలి. 
> 30నిమిషాలు దాటిన వాహనాలపైన రూ.500చొప్పున టోయింగ్ ఛార్జీలను విధిస్తారు. 
> ప్రయాణికులకు స్టేషన్లోకి ప్రవేశించే పోర్టికో వద్ద మాత్రమే కాకుండా ఇంకెక్కడ వాహనాన్ని నిలిపినా టోయింగ్ చెల్లించాల్సిందే.(పార్కింగ్ మినహాయించి)