మొండెం తెలంగాణాలో.. నాగపూర్ లో తల

  • Published By: vamsi ,Published On : February 27, 2019 / 03:04 AM IST
మొండెం తెలంగాణాలో.. నాగపూర్ లో తల

Updated On : February 27, 2019 / 3:04 AM IST

ఓ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తల, మొండెం వేరయ్యాయి. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే నాగపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయాడు. జనగామ-రఘునాథపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పడిన వ్యక్తి శరీర భాగాలు నుజ్జయ్యాయి. మొండెం అక్కడే పడిపోగా.. తల మాత్రం రైలు మెట్ల మధ్య ఇరుక్కోవడంతో 400 కి. మీ ప్రయాణించి చివరకు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ కు  చేరుకుంది.

అక్కడి పోలీసుల సమాచారం మేరకు అప్రమత్తమైన కాజీపేట రైల్వే పోలీసులు  తలను ఇక్కడకు తీసుకొచ్చారు. తర్వాత ఎంజీఎం హాస్పిటల్ లో తలను, మొండెంకు అతికించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే మృతుడికి సంబంధించిన  వివరాలు తెలియరాలేదు.