ఏరా..మనిషివేనా: హత్య చేయకుండా ఉండాలంటే అత్యాచారానికి సహకరించాలట

మహిళలు హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించాలనీ..వారు కూడా కండోమ్ లు ఉంచుకోవాలనీ అలా చేస్తే ప్రాణాలు దక్కుతాయంటూ ..తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు తనకు తాను దర్శకుడుగా ప్రకటించుకుంటున్న డేనియల్ శ్రవణ్ అనే వాడు.
దిశా అత్యాచారం ఘటనపై స్పందిస్తూ అతను ఈ విధంగా సంచలన కామెంట్స్ చేశాడు. దాంతో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు ఎందరో నెటిజన్లు అతన్ని ఏకిపారేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే నరికిపారేస్తామని బెదిరిస్తున్నారు.
రేపిస్ట్‌లు ఆడవాళ్లపై హాత్యాచారాలకు కారణం మహిళా సంఘాలు, సమాజమేనన్నాడు. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, మహిళా సంఘాలు రేప్‌ని, రేపిస్ట్‌లను లీగల్ చేస్తే అత్యాచారం చేశాక చంపాలన్న ఆలోచన రేపిస్ట్‌లకు రావు. దిశా హత్యకు కారణం ఆ నలుగురు కాదు ప్రభుత్వం, మహిళా సంఘాలే.
ఆడవాళ్లను రేప్ చేసేటప్పుడు రేపిస్టులకు సహకరించాలి. లేకపోతే ఎక్కడ పోలీసులకు చెప్తారోనన్న భయంతో రేపిస్టులు వారిని చంపేస్తున్నారనీ..ప్రభుత్వం రేపిస్ట్‌లపై చట్టాలను రుద్దకపోతే వాళ్లు కూడా ఆడవాళ్లని రేప్ చేశాక చంపకుండా ఉంటారని అన్నారు. కండోమ్‌లతోనే మహిళల ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నాడు.
ఇది రేపిస్ట్‌లకు సపోర్ట్ చేసినట్లు కాదనీ..మహిళలపై ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఇదొక్కటే పరిష్కారమని ఉచిత సలహాలు ఇచ్చాడు. 18 ఏళ్ల వయసు పైబడిన అమ్మాయిలు రేప్ లైంగిక విద్య గురించి అవగాహన పెంచుకోవాలని సలహా ఇచ్చాడు. రేపిస్టులు రేప్ చేసేటప్పుడు మహిళలు ప్రతిఘటించకుండా సహాకరించాలని అలా చేస్తేనే వారు రేప్ జరిగిన తరువాత కూడా ప్రాణాలతో ఉంటారని అలా చేయకుంటే రేప్ అయిన తర్వాత కూడా సురక్షితంగా ఉంటారు. రేప్ ఒక్కటే రేపిస్ట్‌లను సంతృప్తి పరుస్తుంది. ఆలోచిస్తే ఆడవాళ్ల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇదొక్కటే కారణం నాకు అనిపిస్తోందన్నాడు శ్రవణ్.
దీనిపై పలువురు ఏకిపారేస్తుండటంతో ఫేస్ బుక్ నుంచి ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు. ఇటువంటి పిచ్చి పోస్ట్ లు పెడితే అంతు చూస్తామంటు కొంతమంది వార్నింగ్ లు కూడా ఇచ్చారు. దీంతో పోస్ట్ ను డిలీట్ చేసినా శ్రవణ్ పై ఆగ్రహం తగ్గటంలేదు. చీప్ పబ్లిసిటీ కోసం ఇటువంటి రాతలు రాస్తూ కూతలు కూస్తున్నాడంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.