దారుణం : యువకుడి చేతులు కట్టేసి చెట్టుకు ఉరి 

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 09:28 AM IST
దారుణం : యువకుడి చేతులు కట్టేసి చెట్టుకు ఉరి 

హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలో పెరుగుతున్న నేరాల విషయంలో పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నా నేరాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో మరో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి చెట్టుకు ఉరి వేసిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన పార్శిగుట్టలోని  గాంధీనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని చాచా నెహ్రూ నగర్ లో జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమా? లేదా పాత కక్షలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.