Cars to employees: దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. తమ ఉద్యోగులకు కార్లు ఇచ్చిన త్రిధ్య టెక్
గూగుల్, మెటా వంటి దిగ్గజ బహుళజాతి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఓ భారతీయ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను ఇచ్చింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిధ్య టెక్ సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న 13 మందికి 13 ఖరీదైన కార్లను అందించింది. దీనిపై ఆ సంస్థ ఎండీ రమేశ్ మారంద్ మాట్లాడుతూ... తమ సంస్థ అయిదేళ్లుగా సాధించిన విజయాల వెనుక.. కష్టపడి పనిచేసే తమ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
Cars to employees: గూగుల్, మెటా వంటి దిగ్గజ బహుళజాతి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఓ భారతీయ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను ఇచ్చింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిధ్య టెక్ సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న 13 మందికి 13 ఖరీదైన కార్లను అందించింది. దీనిపై ఆ సంస్థ ఎండీ రమేశ్ మారంద్ మాట్లాడుతూ… తమ సంస్థ అయిదేళ్లుగా సాధించిన విజయాల వెనుక.. కష్టపడి పనిచేసే తమ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
వారి కష్టపడేతత్వం, నిబద్ధతకు రివార్డుగా ఈ కార్లను ఇస్తున్నట్లు తెలిపారు. బాగా పనిచేసే ఉద్యోగులకు భవిష్యత్తులోనూ ఇటువంటి కానుకలు అందిస్తామని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తే ఉద్యోగులు మరింత బాగా పనిచేసి, సంస్థ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తారని అన్నారు.
తమను కంపెనీ యాజమాన్యం బాగా ప్రోత్సహిస్తోందని, తమ శ్రమను గుర్తిస్తోందని ఉద్యోగులు చెప్పారు. గతంలోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇటువంటి ప్రోత్సాహకాలే ఇచ్చి ఉత్సాహపర్చాయి. లాభార్జనే తప్ప ఉద్యోగుల గురించి పట్టించుకోవు కొన్ని సంస్థలు. కొన్ని కంపెనీలు మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.
Pakistan’s inflation: 1975 నుంచి ఎన్నడూలేనంత గరిష్ఠానికి పాక్ ద్రవ్యోల్బణం!