షహీన్‌బాగ్ షూటర్‌ను పార్టీలో చేర్చుకుని కొద్దిగంటల్లోనే బహిష్కరించిన బీజేపీ

Shaheenbagh: బీజేపీ కొద్ది గంటల్లోనే పార్టీలో చేరిన వ్యక్తిని బహిష్కరించింది. 25ఏళ్ల వయస్సున్న కపిల్ గుజ్రార్ అనే వ్యక్తి యాంటీ సీఏఏ ఆందోళనలో ఫిబ్రవరి 1న పాల్గొన్నాడు. బుధవారం అతను బీజేపీ ఘాజియాబాద్ యూనిట్ లో జాయిన్ అయ్యాడు. కొద్ది గంటలు మాత్రమే కొనసాగిన అతని సభ్యత్వాన్ని పార్టీ రద్దు చేసింది. అతని క్రిమినల్ చర్యల గురించి తెలియకపార్టీలో చేర్చుకున్నామని వివరణ ఇచ్చింది.
బీజేపీ జిల్లా కన్వీనర్ సంజీవ్ శర్మ కార్యక్రమంలో మాట్లాడుతూ… కపిల్ గుజ్రార్ వందల మంది సపోర్టర్లతో పాటు పార్టీలో చేరారు. అతను ప్రాంతం మొత్తంమీద ప్రభావం చూపించగలడు. పార్టీ పాలసీలు, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పనితీరు నచ్చి పార్టీలో చేరారు. ప్రదేశ్ అధ్యక్ష స్వాతంత్ర్య దేవ్ సింగ్ జీ ప్రభావం అతనిపై ఉంది. వీరంతా విభిన్న పార్టీల్లో హిందూత్వం గురించి పనిచేశారు. ఆయన్ను కలిసి నా ద్వారా బీజేపీలో చేరతామని అడిగారు’ అని సంజీవ్ అన్నారు.
దాంతో పాటుగా.. ‘మేం బీజేపీతో ఉన్నాం. హిందూత్వం బలపడే దిశగా అడుగులు వేస్తాం. వాళ్లు చేసే వాటిలో చాలా వరకూ హిందువుల గురించే. నేనెప్పుడూ హిందుత్వం గురించి దేశం గురించి ఏదో చేయాలనుకుంటాను. అందుకే బీజేపీలో చేరాను. ఇంతకంటే ముందు నేను ఏ పార్టీలో లేను. ఆర్ఎస్ఎస్ లో సభ్యుడిగా ఉన్నాను’ అని వెల్లడించాడు.
కొద్ది గంటల తర్వాత శర్మ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. ‘ఈ రోజు మహానగర్ ఆఫీసులో బీఎస్ పీ నుంచి కొందరిని పార్టీలోకి చేర్చుకున్నాం. అదే గుంపులో కపిల్ గుజ్రార్ కూడా ఉన్నాడు. అతను షహీన్ బాగ్ విషయంలో ఒకడని మాకు తెలీదు. అది తెలిసిన వెంటనే పార్టీ అతని సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది’ అని వివరణ ఇచ్చారు.
ఇవాల్టి ప్రెస్ నోట్ తర్వాత గుజ్రార్ బీఎస్పీకి చెందిన వ్యక్తిగా చెప్పారు. కానీ, ఆ షూటింగ్ జరిగిన తర్వాత గుజ్రార్ ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన వాడిగా చెప్పింది బీజేపీ.