ఉత్తరాఖాండ్ బీభత్సం.. 170మంది గల్లంతు.. ఏడుగురు మృతి

ఉత్తరాఖాండ్ బీభత్సం.. 170మంది గల్లంతు.. ఏడుగురు మృతి

Updated On : February 8, 2021 / 10:19 AM IST

Uttarakhand: గర్వాల్ హిమాలయ పర్వతాల్లో.. చమోలీ జిల్లా తపోవన్ ప్రాంతంలోని రైనీ గ్రామంలో జరిగిన ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. 2013కేదర్‌నాథ్ ఘటనను తలపిస్తున్న ఈ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్లు కన్ఫామ్ చేశారు. ఈ ప్రమాదంలో మరెంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలియాల్సి ఉంది.

జషీమాత్ సమీపంలో ఉన్న 13.2 మెగావాట్ కెపాసిటీ ఉన్న రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ నాశనమైపోయింది. దౌలిగంగా నదిపై నిర్మించిన 520మెగావాట్ ఎన్టీపీసీ హైడ్రో ప్రాజెక్ట్ నష్టపోగా.. కనీసం ఓ ఐదు బ్రిడ్జ్ లు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ మిస్ అయిన వారిలో 148మంది ఎన్టీపీసీ హైడ్రోపవర్ సైట్ లో పనిచేసేవారున్నారు. 22మంది విష్ణుగడ్ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యక్తులుగా సమాచారం.

‘తపోవన్ బ్రిడ్జ్ వద్ద వాటర్ లెవల్ వెయ్యి 803మీటర్లు ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాటర్ లెవల్ 1808 మీటర్లు దాటడం వల్ల ప్రమాదం జరిగిందని’ స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పీయూశ్ రౌతేలా అంటున్నారు.

జోషిమఠ్ వద్ద దౌళిగంగ నది నీటి స్థాయి పెరిగి అన్ని రికార్డులు తుడిచిపెట్టేసిందని కేంద్ర వాటర్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. ఉదయం 11గంటల సమయంలో జోషిమఠ్ వద్ద 1388మీటర్లు ఉందని ఏజెన్సీలు చెబుతున్నాయి. 2014 ఉత్తరాఖాండ్ వరదల సమయంలో ఆ ప్రాంతంలో కేవలం 1385.54మీటర్లు మాత్రమే ఉంది.

ఘటనపై ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం త్రివేంద్ర రావత్.. రూ.4లక్షల రిలీఫ్ ను ప్రకటించారు. ప్రధాని మోడీ సైతం రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 100మంది ఆర్మీ పర్సనల్స్, ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్, ఐటీబీపీ నుంచి ఫస్ట్ బెటాలియన్ కు చెందిన 250మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.