Kannur University VC: కేరళ గవర్నర్ ఆదేశాలపై కన్నూరు వర్సిటీ వీసీ స్పందన.. రాజీనామా చేయనని స్పష్టం

కేరళలోని తొమ్మిది మంది యూనివర్సిటీల వైస్ చాన్స్‭లర్లు సోమవారంలోగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ 11:30 గంటలలోపు రాజీనామాను సమర్పించాలని ఇప్పటికే వైస్ ఛాన్సలర్లకు లేఖలు అందాయి. దీనిపై కన్నూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‭లర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పందిస్తూ... ‘‘గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నుంచి నాకు లేఖ అందింది. అయితే, నేను రాజీనామా చేయను. ఆర్థిక అవకతవకలు, ప్రవర్తన బాగోలేని కారణాల వల్ల రాజీనామా చేయాలని అన్నారు. అయితే, ఆ రెండు తప్పులు ఇక్కడ జరగలేదు. గవర్నర్ చేసినవి తప్పుడు ఆరోపణలు’’ అని చెప్పారు.

Kannur University VC: కేరళ గవర్నర్ ఆదేశాలపై కన్నూరు వర్సిటీ వీసీ స్పందన.. రాజీనామా చేయనని స్పష్టం

Updated On : October 24, 2022 / 11:26 AM IST

Kannur University VC: తాను రాజీనామా చేయబోనని కన్నూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‭లర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పష్టం చేశారు. కేరళలోని తొమ్మిది మంది యూనివర్సిటీల వైస్ చాన్స్‭లర్లు సోమవారంలోగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ 11:30 గంటలలోపు రాజీనామాను సమర్పించాలని ఇప్పటికే వైస్ ఛాన్సలర్లకు లేఖలు అందాయి.

దీనిపై కన్నూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‭లర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పందిస్తూ… ‘‘గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నుంచి నాకు లేఖ అందింది. అయితే, నేను రాజీనామా చేయను. ఆర్థిక అవకతవకలు, ప్రవర్తన బాగోలేని కారణాల వల్ల రాజీనామా చేయాలని అన్నారు. అయితే, ఆ రెండు తప్పులు ఇక్కడ జరగలేదు. గవర్నర్ చేసినవి తప్పుడు ఆరోపణలు’’ అని చెప్పారు.

కన్నూరు వీసీగా తనను నియమించడంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో వీసీని గవర్నర్ ఎలా తొలగిస్తారని ఆయన నిలదీశారు. కాగా, గవర్నర్ నుంచి లేఖలు అందుకున్న తొమ్మిది యూనివర్సిటీల వీసీల్లో కన్నూరు వర్సిటీ వీసీతో పాటు యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, అబ్దుల్ కలాం టెక్నాలాజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంసృత్, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, థంచాత్ ఎజుతాచన్ మలయాళం యూనివర్సిటీలు ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..