Man Defecates On Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి మలవిసర్జన..అరెస్ట్

మరో సారి విమానంలోనే ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి-ఢిల్లీ ఏఐసీ 866 నంబర్ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఉండగానే 17ఎఫ్ సీటులో ఉన్న ప్రయాణికుడు రామ్ సింగ్ మద్యం తాగి విమానంలోనే బహిరంగంగా మల,మూత్ర విసర్జన చేసి ఉమ్మి వేశాడు.....

Man Defecates On Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి మలవిసర్జన..అరెస్ట్

Air India Flight

Man Defecates On Air India Flight : మరో సారి విమానంలోనే ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి-ఢిల్లీ ఏఐసీ 866 నంబర్ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఉండగానే 17ఎఫ్ సీటులో ఉన్న ప్రయాణికుడు రామ్ సింగ్ మద్యం తాగి విమానంలోనే బహిరంగంగా మల,మూత్ర విసర్జన చేసి ఉమ్మి వేశాడు. (Mumbai-Delhi Air India Flight)

Sudipto Sen : కొత్త సినిమా ప్రకటించిన కేరళ స్టోరీ దర్శకుడు.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌!

ఈ ఘటన జూన్ 24వతేదీన జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ చర్యతో తోటి ప్రయాణికులు విస్తు పోయారు. ప్రయాణికుడి నిర్వాకాన్ని గమనించిన విమాన సిబ్బంది అతన్ని మౌఖికంగా హెచ్చరించారు. పరిస్థితిని పైలట్ కు తెలియజేసి భద్రత కోరారు. విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా సెక్యూరిటీ హెడ్ వచ్చి ప్రయాణికుడిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Vivo Y35 Discount : అమెజాన్‌లో వివో Y35 ఫోన్‌పై అదిరే డిస్కౌంట్.. ఇప్పుడే సొంతం చేసుకోండి..!

సదరు ప్రయాణికుడు రామ్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 510, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.(Arrest) గత ఏడాది నవంబర్ 26వతేదీన ఓ ప్రయాణికుడు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశారు. మళ్లీ గత ఏడాది డిసెంబర్ 6వతేదీన పారిస్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశారు.