Aggressive Stray Dogs : వీధి కుక్కల కాటుకు కళ్లెం వేసేందుకు వినూత్న ప్రణాళిక
నగరంలో వీధి కుక్కల కాటుకు కళ్లెం వేసేందుకు పంచకుల మున్సిపల్ అధికారులు వినూత్న చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పంచకుల నగరంలో గత ఆరు నెలల్లోనే 5వేల కుక్కకాటు కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ వీధి కుక్కల దూకుడు కళ్లెం వేసేందుకు వినూత్న ప్రణాళిక చేపట్టింది....

Aggressive Stray Dogs
Aggressive Stray Dogs : వీధి కుక్కల దూకుడుకు కళ్లెం వేయాలని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. పంచకుల నగరంలో గత ఆరు నెలల్లోనే 5వేల కుక్కకాటు కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ వీధి కుక్కల దూకుడు కళ్లెం వేసేందుకు వినూత్న ప్రణాళిక చేపట్టింది. (Panchkula MC plan) దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజలపై దాడి చేసి కరుస్తున్న వీధి కుక్కలను దత్తత తీసుకొని, వాటికి శిక్షణ ఇచ్చి శాంతపర్చాలని (calm down Aggressive Stray Dogs) గురువారం మేయర్ కులభూషణ్ గోయల్ అధ్యక్షతన జరిగిన డాగ్ మానిటరింగ్ అండ్ స్టెరిలైజేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
Free Bus Seat : కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడంటే…షాకింగ్
ప్రజలను కుక్కకాటు బారి నుంచి కాపాడేందుకు వీధికుక్కల దత్తత, శిక్షణ కార్యక్రమం చేపట్టామని మేయర్ ప్రకకటించారు. పంచకుల నగరంలో 2020వ సంవత్సరంలో 5,692 కుక్కకాటు కేసులు, 2021 వ సంవత్సరంలో 6,016, 2022లో 5,655 కేసులు నమోదయ్యాయి. నగరంలోని ప్రతీ వార్డు నుంచి వీధి కుక్కలను తీసుకొని వాటికి 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఈ వీధికుక్కలను దత్తత తీసుకోవచ్చు లేదా వాటి ఆహారానికి నిధులు సమకూర్చవచ్చని మేయర్ చెప్పారు.
Crocodile Enters House : కృష్ణా నదీ తీరంలోని ఇంట్లోకి వచ్చిన మొసలి…ఆపై ఏం జరిగిందంటే…
సెక్టార్ 6లోని సివిల్ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి ప్రతీరోజూ సగటున ఐదు కుక్కకాటు కేసులు వస్తున్నాయి. పెంపుడు కుక్కలను నమోదు చేయించాలని మున్సిపాలిటీ ఆదేశించింది. పెంపుడు కుక్కల నమోదు చేయించకపోతే రెండు వేల రూపాయల జరిమానా విధించడంతోపాటు పెంపుడు కుక్కను జప్తు చేయాలని మున్సిపాలిటీ నిర్ణయించింది.
School Teacher : ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరిట విద్యార్థులకు వింత శిక్ష విధించాడు…ఆపై…
పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే దాని యజమానిపై చర్యలు తీసుకుంటామని పంచకుల మేయర్ చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం మన హైదరాబాద్ నగరంలో పెచ్చుపెరిగిపోతున్న కుక్క కాట్లకు జీహెచ్ఎంసీ అధికారులు పంచకుల నగరం తరహాలో వీధి కుక్కలకు కళ్లెం వేయాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.