15 ఏళ్లుదాటిన వాహనాలు ఇక చెత్తకిందే లెక్క, స్క్రాపేజ్ పాలసీకి అనుమతి వచ్చేసింది.. ఏప్రిల్ 2022నుంచి అమల్లోకి

Scrappage Policy: రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ జనవరి 25న స్క్రాపేజ్ పాలసీని అప్రూవ్ చేసింది. 15ఏళ్లు కంటే పాతవైన ప్రభుత్వ వాహనాలను స్క్రాపింగ్ చేయొచ్చని కన్ఫామ్ చేశారు. ఇంకా ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.
దీనిని బట్టి 15ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న వాహనాలను ప్రభుత్వ శాఖలు చెత్తలో పడేయనున్నాయి. యూనియన్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిష్టర్ నితిన్ గడ్కరీ గత సెప్టెంబరులో స్క్రాపేజ్ పాలసీ అనేది వారి టాప్ ప్రియారిటీస్ లో ఒకటి అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి దాంతో పాటు ఆటోమొబైల్ సెక్టార్ ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత జులైలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వెహికల్ స్క్రాపింగ్ కు గైడ్ లెన్స్ ఇష్యూ చేయడంలో ఆలస్యం చేసింది. ఎన్జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ మాట్లాడుతూ.. రీసైకిల్ సెంటర్స్‌లో ప్రోపర్ మెకానిజం ఉండాలని అన్నారు. MoRTH పబ్లిక్ డొమైన్ లో ఇప్పటికే డ్రాఫ్ట్ స్క్రాపేజ్ పాలసీ గురించి షేర్ చేసేసుకుంది.