Hijab ban case: హిజాబ్ వివాదం.. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేర్వేరు తీర్పులు
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే, హైకోర్టు తీర్పును జస్టిస్ దులియా తప్పుబట్టారు. విద్యార్థుల చదువలకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ దులియా అన్నారు. చివరకు సరైన ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సిఫార్సు చేయాలని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు.

Hijab Row Case
Hijab ban case: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే, హైకోర్టు తీర్పును జస్టిస్ దులియా తప్పుబట్టారు. విద్యార్థుల చదువలకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ దులియా అన్నారు. చివరకు సరైన ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సిఫార్సు చేయాలని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు.
ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన వేర్వేరు తీర్పులపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఇజాజ్ స్పందిస్తూ… ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ లోని అంశం ప్రకారం.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచారు. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి లేదా ఇతర ధర్మాసనానికి అప్పగించడంపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారు’’ అని వివరించారు.
కాగా, కర్ణాటకలో కలకలం రేపిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తుది తీర్పు వెల్లడిస్తూ… హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని తెలిపిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై సర్కారు విధించిన నిషేధాన్ని హైకోర్టు సమర్థించి, ఆ అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. విద్యార్థులు విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను పాటించాలని చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీనిపై నేడు ఇద్దరు న్యాయమూర్తుల నుంచి వేర్వేరు తీర్పులు వచ్చాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..