Rare Vulture Video: అరుదైన రాబందును పట్టుకున్న గ్రామస్థులు

దేశంలో ఎన్నో గద్ద జాతి పక్షులు అంతరించిపోతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ అరుదైన తెల్లని రాబందు కనపడింది. దాన్ని పట్టుకున్న స్థానికులు అటవీ అధికారులకు దాన్ని అప్పగించారు. అని హిమాలయ గ్రిఫ్ఫోన్ రాబందు అని తెలిపారు. అది కాన్పూర్ లోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో వారం రోజులుగా ఉందని స్థానికులు చెప్పారు.

Rare Vulture Video: అరుదైన రాబందును పట్టుకున్న గ్రామస్థులు

Rare Vulture Video

Updated On : January 9, 2023 / 11:35 AM IST

Rare Vulture Video: దేశంలో ఎన్నో గద్ద జాతి పక్షులు అంతరించిపోతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ అరుదైన తెల్లని రాబందు కనపడింది. దాన్ని పట్టుకున్న స్థానికులు అటవీ అధికారులకు దాన్ని అప్పగించారు. అని హిమాలయ గ్రిఫ్ఫోన్ రాబందు అని తెలిపారు. అది కాన్పూర్ లోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో వారం రోజులుగా ఉందని స్థానికులు చెప్పారు.

దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అది తప్పించుకుని తిరిగిందని తెలిపారు. చివరకు అది భూమిపై తిరుగుతున్న సమయంలో పట్టుకున్నామని చెప్పారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని, వారికి దాన్ని అప్పగించామని వివరించారు. ఆ సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున రాబందు వద్దకు వచ్చి దాన్ని చూశారు.

రాబందు పొడవాటి రెక్కలు, దాని ఆకారం చూసి ఆశ్చర్యపోయారు. చాలా మంది దానితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దాని రెక్కలు దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్నాయి. సాధారణంగా ఇవి టిబెట్ పీఠభూమి హిమాలయాలపై కనపడతాయి. అంతరించి పోతున్న రాబందు జాతుల్లో గ్రిఫ్ఫోన్ రాబందు కూడా ఒకటి.

భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972)లో షెడ్యూల్-1 కింద రాబందులు కూడా ఉన్నాయి. 1990 నుంచి రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. 1990 నుంచి రాబందుల సంఖ్య 99 శాతం తగ్గిపోయిందని ఓ నివేదిక చెబుతోంది.

Chiranjeevi : రవితేజ సినిమాలు హిట్టు అయినప్పుడు చిరంజీవి గారు పార్టీ ఇస్తారు.. కోన వెంకట్!