కరోనా సోకినా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? సైంటిస్టులు చెప్పిన రెండు కారణాలు ఇవే!

  • Published By: sreehari ,Published On : April 20, 2020 / 06:01 AM IST
కరోనా సోకినా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? సైంటిస్టులు చెప్పిన రెండు కారణాలు ఇవే!

Updated On : April 20, 2020 / 6:01 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ ఉన్నవారిలో 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం అని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. 80 శాతం కేసులు లక్షణరహితమైనవిగా ఆయన పేర్కొన్నారు. వాటిని గుర్తించడంలో పెద్ద ఆందోళన ఉంది. కాంటాక్ట్ ట్రేసింగ్ తప్ప వేరే మార్గం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేద్కర్ అన్నారు.

ఇంకా చాలా మంది లక్షణం లేని వ్యక్తులు ఉండవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. సోమవారం ఉదయం నాటికి భారతదేశం అంతటా 543 మరణాలతో సహా 17,000కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. లక్షణం లేని కేసులను గుర్తించడం చాలా కష్టం పాజిటివ్‌గా పరీక్షించబడిన వ్యక్తుల పరిచయాలను గుర్తించిన తర్వాతే వాటిని కనిపెట్టారు. ప్రతి ఒక్కరినీ పరీక్షించడం దాదాపు అసాధ్యమని సైంటిస్టు గంగాఖేద్కర్ చెప్పారు. 

అల్లాడిపోతున్న అమెరికా.. 28,998 మంది మృతి :
కానీ, కొంతమంది వైరస్ రహాస్యంగా దాగి ఉండి.. చాప కింద నీరులా వందల మందికి వ్యాపిస్తోంది. కరోనా వైరస్ సోకినవారిలో చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బారినపడినట్టు కూడా వారు గ్రహించలేని పరిస్థితి కనిపిస్తోంది. తమకు తెలియకుండానే తమ నుంచి ఇతరులకు వైరస్ వ్యాపింపచేస్తున్నామని తెలుసుకోలేకపోతున్నారు. కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. అమెరికాలో ఇప్పటికే 28,998 మంది వైరస్ సోకి మృతిచెందినట్టు కొందరు అంచనా వేస్తున్నారు.

వైరస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం.. కనీసం గొంతులో ఎలాంటి సమస్య లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా లక్షణాలు కనిపించని వారిని పరీక్షిస్తే తప్ప వారిలో వైరస్ ఉందని గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి కరోనా బాధితులు ఎంతో మంది ఉండి ఉంటారు. కరోనా కేసుల్లో కచ్చితత్వాన్ని గుర్తించడం కష్టంగా మారుతోంది. మిగతా వారిలో మాదిరిగా కొంతమందిలో కరోనా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? రహాస్యంగా కరోనా ఎందుకిలా ప్రవర్తిస్తోంది అనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది?. దీనికి అసలు కారణం ఏంటి? అనే దానిపై సైంటిస్టులు రెండు రకాల ఆలోచనలను వ్యక్తపరిచారు. 

25 శాతం మందిలో లక్షణాలు లేవు :
ఈ రెండు రకాల కారణంగానే కరోనా సోకినప్పటికీ వారిలో ఎలాంటి వ్యాధి తాలుకు లక్షణాలు కనిపించడం లేదని అంటున్నారు. CDC డైరెక్టర్ Robert Redfield మాట్లాడుతూ.. కరోనా సోకిన వారిలో 25 మందికిపైగా లక్షణాలు ఉండటం లేదని అంచనా వేసినట్టు ఆయన చెప్పారు. ఇతర అంచనాల్లో 18 నుంచి 30 శాతంగా ఉన్నట్టు తెలిపారు. కొవిడ్-19 వైరస్ లక్షణాలు కొంతమందిలో మాత్రమే కనిపిస్తున్నాయి.. ఇతరుల్లో ఎందుకు కనిపించడం లేదు అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదన్నారు. దీనిపై సైంటిస్టులు రెండు సిద్ధాంతాలను సూచిస్తున్నారు. 

* కొంతమందిలో బలమైన సహజమైన వ్యాధినిరోధక వ్యవస్థ వైరస్‌ను సమర్థవంతగా ఎదుర్కొంటోంది. 
* మరికొంతమందిలో ఒకే రకమైన వైరల్ లోడ్ అయి ఉండటంతో వైరస్ ను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. 

University of California San Franciscoలో ఇమ్యూనోలాజిస్ట్, మైక్రోబయోలాజిస్ట్ Warner Greene చెప్పిన ప్రకారం.. కరోనా వైరస్ సోకిన కొంత మందిలో వారిలోని సహజమైన రోగ నిరోధక వ్యవస్థ.. వైరస్ పై సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. సహజ వ్యాధినిరోధకత బలంగా వైరస్‌లపై ఫైట్ చేస్తోంది. శరీరం వెలుపల, శ్లేష్మ పొర లేదా చర్మం వంటి ప్రాథమిక సాధారణ సాధనాలతో కలిగి ఉంటుంది. సహజ కిల్లర్ కణాలు వంటి శరీరం లోపల జనరలిస్ట్ సాధనాలతో కూడి ఉంటుంది. వైరస్ కణాలను గుర్తించిన వెంటనే వాటిని నాశనం చేయడానికి తెల్ల రక్త కణాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి.. వీటినే రక్షక భటులు అని కూడా పిలుస్తారు. 

SARS-CoV-2ను గుర్తించి దానిని నాశనం చేయడానికి యాంటీ బాడీస్.. రోగనిరోధక వ్యవస్థకు కాస్తా భిన్నంగా ఉంటుంది. వీటినే ప్రతి రోగనిరోధకాలు అని అంటారు.  శరీరంలో ఏదైనా వైరస్ లేదా ఇతర బ్యాక్టిరియా దాడి చేసినప్పుడు ముందుగా ఎదుర్కొంటాయి. వీటినే సహజమైన రోగనిరోధక శక్తిగా పిలుస్తారని Greene చెప్పారు. ఇవి ప్రతిరోధకాలు కాదు.. T-కణాలు అంతకన్నా కాదు. కొంతమందికి ఈ వైరస్‌కు బలమైన సహజమైన రోగనిరోధక ప్రతిస్పందన ఉంటుందని ఆయన తెలిపారు. 

ఇతర సిద్ధాంతాలు సూచించిన ప్రకారం పరిశీలిస్తే.. 
శరీర ప్రభావానికి వెలుపల ఉన్న కారకాలను సూచిస్తున్నాయి. ఎందుకు కొంతమంది అనారోగ్యానికి గురికావడం లేదు. మీరు ఎంత వైరస్‌కు గురవుతున్నారో నిర్ధారించవచ్చు. చైనాలో నిర్వహించిన అధ్యయనాలు అధిక ‘Viral Load’ (శరీరంలో అధిక మొత్తంలో వైరస్ ప్రసారం) ఉన్నవారికి అధ్వాన్నమైన లక్షణాలను కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే, ఈ ఆలోచనకు Greene అనుకూలంగా లేరు. ఎక్కువగా, శరీరం లోపల కొన్ని కారకాల కారణంగా ఎవరు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. ఎవరు అనారోగ్యానికి గురికారు అనేది నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

డయాబెటిస్, ఊబకాయం, ఉబ్బసం లేదా రోగనిరోధక వ్యవస్థకు ఆటంకం కలిగించే ఇతర అనారోగ్యాలు వంటి అంతర్లీన పరిస్థితులు ఎక్కువ ప్రమాదంలో ఉంచుతాయని ఇప్పటికే తెలుసు. వృద్ధులు కూడా ప్రమాదంలో ఉన్నట్టే గ్రీన్ చెప్పారు. కానీ శాస్త్రవేత్తలు ఇతర బయోమార్కర్ల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. Greene ప్రస్తుతం బయోమార్కర్ల కోసం శోధించడానికి ఉద్దేశించిన ఒక అధ్యయనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 

Also Read | కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చెప్పిన..బాల జ్యోతిష్కుడు