Washington‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో..

అమెరికా ప్రజలు వణికిపోతున్నారు.. కాల్పుల శబ్ధం వినిపిస్తే చాలు ఆమడదూరం పరుగెడుతున్నారు. ఇటీవల జరిగిన విషాద ఘటన అక్కడి ప్రజలను అంతలా భయపెట్టింది. స్కూల్ లో కాల్పులు జరిగిన వారంరోజులకే అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. 26ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా స్థానిక ప్రజలపై కాల్పులు జరిపాడు...

Washington‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో..

Shotting

Updated On : May 30, 2022 / 8:55 AM IST

Washington‌: అమెరికా ప్రజలు వణికిపోతున్నారు.. కాల్పుల శబ్ధం వినిపిస్తే చాలు ఆమడదూరం పరుగెడుతున్నారు. ఇటీవల జరిగిన విషాద ఘటన అక్కడి ప్రజలను అంతలా భయపెట్టింది. స్కూల్ లో కాల్పులు జరిగిన వారంరోజులకే అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. 26ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా స్థానిక ప్రజలపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధం రావడంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ఓ మహిళల మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి ఎలాంటి ప్రాణాప్రాయం లేదని తెలుస్తోంది.

Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..

ఈ కాల్పుల ఘటన అమెరికాలోని ఓక్లహోమాలో చోటు చేసుకుంది. అక్కడి సమయం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీయగా.. ఓక్లహోమాలోని ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో సుమారు పదిహేను వందల మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో పలువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన 26ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ నల్లాజతి మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కాల్పులు జరిపిన అనంతరం బక్నర్ అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాల్పులు జరిపిన రోజు సాయంత్రమే బక్నర్ పోలీసులకు లొంగిపోయాడు.

Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

గతవారం టెక్నాస్ లోని ఉవాల్డాలో ఓ లిమెంటరీ స్కూల్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా మరో 19 మంది విద్యార్థులు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉన్మాదిని పోలీసులు వెంటనే హతమార్చినప్పటికీ.. ఈ ఘటన అమెరికన్ ప్రజల్లో భయాన్ని కలిగించింది. స్కూల్ లోకి చొరబడ్డ ఉన్మాది ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆ ప్రాంగణం శవాల దిబ్బలా మారింది. ఈ ఘటన దృశ్యాలు అక్కడి ప్రజలు భయ కంపితులను చేశాయి. దీంతో తుపాకీ శబ్దం అంటేనే అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.