Afghan Girls : ఖతార్‌కు సురక్షితంగా అప్ఘాన్ బాలికల రొబొటిక్ బృందం

అప్ఘానిస్తాన్ నుంచి వచ్చిన బాలికల రోబోటిక్స్ బృందంలోని పదిమంది సభ్యులను సురక్షితంగా దేశం దాటించారు. విమానంలో బాలికల బృందాన్ని ఖతార్‌కు తరలించారు.

Afghan Girls : ఖతార్‌కు సురక్షితంగా అప్ఘాన్ బాలికల రొబొటిక్ బృందం

10 Members Of Afghan Girls Robotics Team Safely Evacuated To Qatar

Updated On : August 21, 2021 / 12:00 PM IST

10 members of Afghan girls robotics team safely evacuated to Qatar : తాలిబన్ల చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయింది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునేందుకు అప్ఘాన్లంతా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అప్ఘానిస్తాన్ నుంచి వచ్చిన బాలికల రొబొటిక్ బృందంలోని పదిమంది సభ్యులను విమానంలో సురక్షితంగా దేశం దాటించారు. రోబోటిక్ టీమ్ పేరెంట్ కంపెనీ Digital Citizen Fund (DCF) ప్రకారం.. బాలికల బృందంలోని పది మంది సభ్యులను కాబూల్ విమానశ్రయమం నుంచి విమానంలో దోహా,  ఖతార్‌కు తరలించినట్టు వెల్లడించింది. DCF ఎగ్జిక్యూటివ్‌లైన రోయా మహబూబ్, ఎలిజబెత్ స్కఫర్ బ్రౌన్ ఆగస్టు 12 నుంచి బాలికల బృందాన్ని అప్ఘాన్ నుంచి ఖతార్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయంలో వీసీ ప్రక్రియను వేగవంతం చేసిన ఖతార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని DCF ప్రతినిధి తెలిపారు. తాలిబన్ల ఆక్రమణతో అవుట్‌బౌండ్ విమానాలను రద్దు అయ్యాయి. దాంతో కాబూల్ నుంచి బాలికలను తరలించేందుకు ఖతార్ విమానాన్ని పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఖతార్ ప్రభుత్వ అధికారుల సహకారంతో మహబూబ్ బ్రౌన్ బృంద సభ్యులకు సురక్షితంగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారని DCF ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంప్రదాయవాద షరియా చట్టం ( Sharia Law) తో తాలిబాన్ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. గత పాలనలో తాలిబాన్.. మహిళల దుస్తులను పరిమితం చేసే విధానాలను అమలు చేసింది. ప్రజా జీవితం నుంచి పలు అంశాల్లో బాలికలను నిరోధించింది. బాలికలను పాఠశాలలకు అనుమతించలేదు. బాలికలపై అనేక విషయాల్లో నిషేధాలను అమలు చేసింది.

మరోసారి అఫ్ఘాన్ లో అధికారం చేపట్టిన తాలిబాన్ తమ గతపాలన కంటే భిన్నంగా ప్రదర్శిస్తోంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. మహిళల హక్కులను తాలిబాన్లు గౌరవిస్తారని తాలిబాన్ దీర్ఘకాల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటో మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు.

ముస్లిం ప్రపంచంలోని మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, తూర్పు పొరుగుదేశం పాకిస్తాన్ మహిళలు ప్రధానమంత్రులుగా పనిచేసేందుకు అనుమతించాయి. మరోవైపు, సౌదీ అరేబియాలో కూడా మహిళలకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే అక్కడి దేశంలో మహిళలను కార్లు నడపేందుకు అనుమతించారు.