Canada: కెనడాలో దారుణం.. కత్తిపోట్లకుగురై 10మంది మృతి.. పలువురికి తీవ్రగాయాలు.. ఇద్దరు నిందితుల కోసం గాలింపు
కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు జరిపిన కత్తిపోట్ల దాడిలో 10మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. నిందితులను డామియన్ శాండర్సన్ (31), మైల్స్ శాండర్సన్ (30)గా అనుమానిస్తూ పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. నిందితులకోసం గాలిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
Canada: కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలోని సస్కాచెవాన్ ప్రాంతంలో 13 చోట్ల జరిపిన దాడిలో 10మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 15మందికిపైగా కత్తి పోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకిదిగి ఇద్దరు దుండగులకోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ రోండా బ్లాక్మోర్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి తమకు మొదటి కాల్ ఉదయం 5.40 గంటలకు వచ్చిందని, ఆ తరువాత వరుసగా పలు చోట్ల నుంచి కత్తి దాడుల గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు.
Crime News: హర్యానాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..
కొంతమంది బాధితులను లక్ష్యంగా చేసుకొని నిందితులు ఈ దాడి చేశారని భావిస్తున్నామని, ఇతరులను యాధృచికంగా చంపేసి ఉంటారని తెలిపారు. ఈ దాడికిపాల్పడిన వారిలో ఇద్దరు నిందితులుగా గుర్తించామని, వారు నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరిని తమదగ్గరకు రానివ్వద్దని, పరిచయం లేని వ్యక్తులను వాహనాలు ఎక్కించుకోవద్దని ప్రజలకు సూచనలు చేసినట్లు పోలీస్ కమిషనర్ రోండా బ్లాక్ మోర్ తెలిపారు.
Update #5 for Dangerous Person Alert issued by Melfort RCMP: #RCMPSK received a report the suspects may traveling in the Arcola Ave area around 11:45 a.m. in Regina, SK in a black, Nissan Rogue with SK license 119 MPI. pic.twitter.com/dYlVTmP1CL
— RCMP Saskatchewan (@RCMPSK) September 4, 2022
ప్రొవిన్షయల్ రాజధాని రెజీనాలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు స్థానికుల నుంచి తమకు చివరిసారిగా సమాచారం అందిందని, దీంతో సరిహద్దు ప్రావిన్స్ లు మనితోబా, అర్బర్టా లలోనూ నిందితులకోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం సస్కాచెవాన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ ప్రొటొకాల్ ను ప్రకటించింది. నిందితులు డామియన్ శాండర్సన్, మైల్స్ శాండర్సన్ గా పోలీసులు ఫొటోలను విడుదల చేశారు.