Jackpot village olmen : జాక్‌పాట్ వరించిన గ్రామం..గ్రామస్తుల ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7.5 కోట్లు జమ
గ్రామస్తుల ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7.5 కోట్లు జమ అయ్యాయి. దీంతో గ్రామం అంతా ధనిక గ్రామంగా మారిపోయింది.

Jackpot village olmen In Belgium
Jackpot village olmen In Belgium : ఎవరికైనా లాటరీ తగిలితే అదృష్టవంతుడుగా అంటారు. లాటరీ అనేది నూటికో కోటికో ఒక్కరికి తగులుతుంది. కానీ ఓ గ్రామాన్నే జాక్ పాట్ వరించింది. గ్రామస్తుల బ్యాంక్ ఎకౌంట్లలో కోట్ల రూపాయలు పడ్డాయి. దీంతో గ్రామంలో 165మంది రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయిపోయారు. గ్రామస్తుల ఒక్కొక్కరి ఎకౌంట్ లో రూ.7.5 కోట్లు పడ్డాయి. దీంతో ఊరు ఊరంతా ధనిక దేశంగా మారిపోవటంతో గ్రామస్తులంతా ఆనందంలో మునిగిపోయారు.
ఆ జాక్ పాట్ గ్రామం పేరు ‘ఆల్మెన్’. పేరు వింటే మన దేశంకాదల్లే ఉంది కదూ..నిజమే ఈ గ్రామం బెల్జియంలోని బాలెన్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. లాటరీలో వారికి జాక్‌పాట్ తగిలింది. అలాంటిలాంటి జాక్ పాట్ కాదు. చూస్తే కాదు వింటేనే కళ్లు చెదిరిపోయేంత జాక్‌పాట్ అది.
ఆల్మెన్ గ్రామానికి చెందిన దాదాపు 165 మంది.. ఒక్కొక్కరు 1308 రూపాయలు (బెల్జియం కరెన్సీ) చందాగా వేసుకుని అందరు కలిసి ఉమ్మడిగా యూరోమిలియన్ లాటరీ టికెట్స్‌ను(EuroMillion Lottery Tickets) కొన్నారు. కానీ వారు ఆ సమయంలో బహుశా తమకు అంత పెద్ద మొత్తం వరిస్తుందని ఊహించి ఉండరు.కానీ అనుకోకుండా జరిగేదే కదా జీవితం అంటే.. అదే జరిగింది ఆల్మెన్ గ్రామంలో..గత మంగళవారం (డిసెంబర్ 6,2022)రోజున లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు. ఈ డ్రాలో ఆల్మెన్ గ్రామస్తులు కొనుగోలు చేసిన టికెట్స్‌కు జాక్‌పాట్ తగిలింది.
అలాంటిలాంటి జాక్ పాట్ కాదది..ఏకంగా 123 మిలియన పౌండ్లను బహుమతిగా గెలుచుకున్నారు.ఈ మొత్తం భారత కరెన్సీలో రూ.1200కోట్లకు పైనే. ఈ మొత్తాన్ని 165 మందకి పంచితే ఒక్కొక్కరి అకౌంట్లో దాదాపు రూ.7.50కోట్లు (బెల్జియం కరెన్సీ)జమయ్యాయి. దీంతో ఆ 165 మంది ఆనందంతో మునిగిపోయారు. గత కొన్నేళ్లుగా ఇలానే లాటరీ టికెట్లు కొంటున్నామని కానీ ఇన్నేళ్లకు తమను అదృష్టం వరించింది అని గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య తెలిపారు. ఈ జాక్ పాట్ తో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అని తెలిపారు. దీనిపై లాటరీ నిర్వాహకులు జాక్ వెర్మోర్ మాట్లాడుతూ..గ్రూప్‌లో ఈ విధంగా బహుమతి గెలవడం కొత్త విషయం కాదరని..కానీ 165 మంది వ్యక్తుల బృందం ఇప్పటివరకు అతిపెద్ద లాటరీ విజేతగా నిలిచిందని తెలిపారు.