సన్‌స్క్రీన్ లోషన్ ఎఫెక్ట్ : విరిగిపోయిన యువతి ఎముకలు

సన్ స్క్రీన్ లోషన్ గురించి తెల్లవారి లేస్తే టీవీల్లో ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం. ఫలానా కంపెనీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే శరీరంలో నిగారింపు తగ్గదనీ..తెల్లగా మెరిసిపోతుంటారని ఇలా ఎన్నో ప్రకటలు చూస్తున్నాం. కానీ సన్ స్క్రీన్ లోషన్స్ వల్ల ఓ యువతి ఏకంగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని యువతి ఒంట్లో ఎముకలు విరిగిపోయాయని డాక్టర్లు చెప్పారు.
వివారాల్లోకి వెళితే..చైనాలోని ఝోజియాంగ్ ప్రాంతానికి చెందిన జియాయో మావో అనే 20 ఏళ్ల యువతి విపరీతమై దగ్గుతో బాధపడుతూ డాక్టర్ల దగ్గరకు వెళ్లింది. దానికి డాక్టర్లు ఆమెకు దగ్గుకు సంబంధించిన మెడిసిన్స్ తో పాటు ఇన్ హేలర్ రాసి ఇచ్చారు. కానీ మావోకు దగ్గు ఏమాత్రం తగ్గలేదు. చాతీ పక్కన విపరీతమైన నొప్పి రావటంతో మరోసారి డాక్టర్ దగ్గరకు వెళ్లింది. దీంతో డాక్టర్లు కొన్ని టెస్ట్ లు చేశారు. రిపోర్ట్ చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. మావో శరీరంలో 10 పక్కటెముకలు విరిగిపోయాయని గుర్తించారు.
జియాయో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గు ఎప్పటి నుంచి వస్తోంది. దీని ఏమైన మందులు వాడారా? వంటి విషయాలను అడిగారు. శరీరానికి ఏమైనా మందులు గానీ లోషన్స్ గానీ రాజుకునేవారా? అని అడిగారు. దానికి మావో సన్ స్క్రీన్ లోషన్ రాసుకునేదాన్ని అని చెప్పింది. మావో రాసుకునే సన్ స్క్రీన్ లోషన్స్ వల్లనే ఆమె ఎముకలు విరిగిపోయాయని భావించారు.
ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. జియాయో శరీరంలోని పక్కటెముకలు విరిగిపోవడానికి క్వాంటిటీకి మించి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడమే కారణం కావచ్చని తెలిపారు. లోషన్లు అధికంగా రాసుకోవటం వల్లా..ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనీ..వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయని తెలిపారు. యువత శరీరానికి అవసరమైన విటమిన్ల కోసం 20 నిముషాల పాటు ఉదయం ఎండలో కూర్చుంటే సరిపోతుందని సూచించారు. జియాయో ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడంతో ఆమె శరీరానికి అవసరమైన మేరకు విటమిన్ డీ లభించలేదనీ..దీంతో ఆమె ఎముకలు గుల్లబారిపోయిన విరిగిపోవటానికి కారణమైందని అన్నారు. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం వల్ల ఆమె స్కిన్ టోన్ బాగానే ఉన్నా ఎండ శరీరానికి తగలకపోవటంతో విటమిన్ లోపం ఏర్పడి ఎముకలు బలహీనపడ్డాయని అందుకే విరిగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం జియాయో వైద్యుల సమక్షంలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.