2,000 Year Old Candle : 2000 ఏళ్లనాటి క్యాండిల్‌ను గుర్తించిన విద్యార్ధులు..అభినందించిన శాస్త్రవేత్తలు
2000 ఏళ్లనాటి క్యాండిల్‌ను గుర్తించారు నాలుగవ తరగతి చదివే విద్యార్ధులు. వారిని శాస్త్రవేత్తలు అభినందించారు.

2,000 Year Old Candle found In Israeli
2,000 year old candle : సాధారణంగా మట్టి పొరల్లో కలిసిపోయిన ఎన్నో రహస్యాలను, చరిత్రను తవ్వి తీసి ప్రపంచానికి వెల్లడిస్తుంటారు పురావస్తు శాస్త్రజ్ఞులు. అలా ఇప్పటి కాలగర్భంలో కలిసిపోయిన కనుమరుగు అయిపోయిన చరిత్రలను వెలికి తీసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అలనాటి ప్రాభవాన్ని..అంతరించిపోయిన అరుదైన వింత జీవుల రహస్యాలను వెల్లడించారు. వెల్లడిస్తునే ఉన్నారు.
కానీ కొంతమంది చిన్నారులు కనిపెట్టిన ఓ అరుదైన అద్భుతమైన పురాతన వస్తువును కనుగొని శాస్త్రవేత్తల ప్రసంశలు అందుకున్నారు. ఇజ్రాయెల్ లోని గలీలీ సమీపంలోని కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో ఉన్న స్కూల్లో నాలుగో తరగతి చదివే ముగ్గురు విద్యార్ధులు సెలవు రోజున స్కూల్ క్యాంపస్ సమీపంలో ఆడుకుంటుండగా వారికి ఓ మట్టి కొవ్వొత్తి కనిపించింది.దాన్ని ఏదో రాయి అనుకున్నారు. కానీ దాన్ని తవ్వి తీసేసరికి అదేదో వింతగా అనిపించిందా చిన్నారులకు. అది పట్టికెళ్లి వారి తల్లిదండ్రులకు చూపించారు. దాన్ని చూసినవారు అదేదో పురాతన వస్తువులా ఉందని భావించారు.
దాన్ని ఇజ్రాయెల్ పురావస్తు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు.దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అది 2,000 ఏళ్లక్రితం నాటి మట్టి క్యాండిల్ అని గుర్తించారు. ఈ విషయాన్ని సోమవారం (డిసెంబర్ 19,20220 అధికారికంగా ప్రకటించారు.విద్యార్థులను పురావస్తు అధికారులు అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ మట్టి క్యాండిల్ లభ్యమైన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. మరిన్ని వస్తువులు దొరుకుతాయని ఓ కొత్త చరిత్ర బటయపడుతుందని భావిస్తున్నారు.