2270 Flights Cancel : అమెరికాలో మంచు బీభత్సం.. 2270 విమానాలు రద్దు
అమెరికాలో ప్రతికూల వాతావరణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు, గాలి, వాన, శీతల ఉష్ణోగ్రతలతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్ ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.

SNOW
2270 flights cancel : అమెరికాలో ప్రతికూల వాతావరణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు, గాలి, వాన, శీతల ఉష్ణోగ్రతలతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్ ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీగా మంచు కురవడం, ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్ద చేశారు.
పలు విమానయాన సంస్థలు నిన్న సాయంత్రం 6 గంటల వరకు 2270 విమానాలను రద్దు చేశాయి. ముందస్తు జాగ్రత్తగా శుక్రవారం 1000 విమానాలను రద్దు చేశాయి. శనివారం మరో 85 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. నిన్న 7400కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
North India: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి, పొగ మంచు.. 50 మీటర్ల దూరం కనిపించని దారి
వీటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్ నుంచి రాకపోకలు సాగించే విమానాలే పావు వంతు ఉండటం గమనార్హం. అమెరికాలో ఈ రెండు విమానాశ్రయాల నుంచే అధిక మంది రాకపోకలు సాగించడం విశేషం. ఇకపోతే చికాగాలో మూడు గంటలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.