Morocco : సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా..24 మంది మృతి

మొరాకో దేశంలో తాజాగా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు....

Morocco : సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా..24 మంది మృతి

Morocco bus overturns

Updated On : August 7, 2023 / 8:04 AM IST

Morocco : మొరాకో దేశంలో తాజాగా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు. సెంట్రల్ మొరాకోలోని డెమ్నాట్ అనే చిన్న పట్టణంలోని వీక్లీ మార్కెట్‌కు ప్రయాణీకులను తీసుకెళుతున్న మినీబస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. (overturns in central Morocco) రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించడానికి రాయల్ జెండర్‌మెరీ, సివిల్ ప్రొటెక్షన్‌తో పాటు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Cricketer Sarfaraz Khan : కశ్మీరు కన్యతో క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం

ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత ఏడాది ఆగస్టులో కాసాబ్లాంకాకు తూర్పున జరిగిన బస్సు ప్రమాదంలో 23 మంది మరణించారు. (23 people killed) 2015వ సంవత్సరంలో దక్షిణ మొరాకోలో యువ అథ్లెట్ల బృందంతో వెళుతున్న సెమీ ట్రైలర్ ట్రక్కు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో 33 మంది మరణించారు.